గిన్నిస్‌ రికార్డ్‌..107 సినిమాల్లో కలిసి నటించిన జంట

వెండితెరపై ఓ హీరోహీరోయిన్‌ కలిసి  పాతిక సినిమాలు చేయడం ఘనతగా భావిస్తారు.  అలాంటిది  మలయాళ చిత్రసీమలో అలనాటి నాయకానాయికలు  ప్రేమ్‌నజీర్‌-శీల  107 సినిమాల్లో కలిసి నటించి గిన్నిస్‌బుక్‌లో స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాదు ఈ జంట కలిసి నటించిన సినిమాల్లో చాలా వరకు విజయాల్ని అందుకోవడం విశేషం. ఎన్నో అజరామరమైన ప్రేమకథల్లో తమ కెమిస్ట్రీతో ప్రేమ్‌నజీర్‌-శీల మలయాళ ప్రేక్షకుల్ని అలరించారు. మలయాళ చిత్రసీమలో దిగ్గజ నటుడిగా పేరొందిన ప్రేమ్‌నజీర్‌  ఖాతాలో మరో రెండు గిన్నిస్‌ రికార్డులున్నాయి. సుదీర్ఘ కెరీర్‌లో 720 సినిమాల్లో హీరోగా నటించాడు ప్రేమ్‌నజీర్‌.  అత్యధిక సినిమాల్లో  కథానాయకుడిగా నటించి రికార్డు సృష్టించారు. 1979లో ప్రేమ్‌నజీర్‌ నటించిన 39 సినిమాలు విడుదలయ్యాయి. ఒక ఏడాదిలో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోగా ఘనతను సొంతం చేసుకున్నారు ప్రేమ్‌నజీర్‌.  ప్రేమ్‌నజీర్‌ రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.