రైతులను మోసం చేస్తే రైస్‌మిల్‌ సీజ్‌: ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కరోనా వైరస్ వల్ల రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతోందన్నారు. మొత్తం 354 కొనుగోలు కేంద్రాలకు పర్మిషన్ ఇచ్చామని,మంగళవారం 287 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరిగిందన్నారు. ఈ 287 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 139.050 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, సేకరించిన ధాన్యంలో 90% ధాన్యాన్ని 125.723 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లుకు పంపడం జరిగిందన్నారు.దీంట్లో 96% అంటే 120794 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు.